ఎమ్మెల్సీ తోట…
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం అని ఆయన అన్నారు. వైసిపి నీ టార్గెట్ చేయడం కోసం మాత్రమే ఈ అరెస్ట్ చేశారని ఈ కేసులు నిలబడవని పేర్కొన్నారు. తొలుత లిక్కర్ స్కాం రూ 50 వేల కోట్లు అన్నారని ఇపుడు 3,500 కోట్లు అంటున్నారని పేర్కొన్నారు.వీటిలో వాస్తవం లేదన్నారు. జగన్ ప్రభుత్వం ఉన్నపుడు లిక్కర్ ఆదాయం,ఇప్పటి లిక్కర్ ఆదాయం పై లెక్కలు తీద్దామని సవాల్ చేశారు. కక్ష కట్టి పాలన చేయడం సరికాదని హితవు పలికారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. ఇప్పుడు మీరున్నారు. తర్వాత తాము అధికారం లో వస్తామన్నారు. ఎవరి ప్రభుత్వమైన కక్ష పూరిత రాజకీయాలు మంచిది కాదని ఆయన అన్నారు. అక్రమంగా అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు గమనిస్తున్నారని గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.