Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 9
Latest Notifications

మాజీ మంత్రి విశ్వరూప్ మండిపడ్డ బీఎస్పీ బికెవైసి నాయకులు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

అల్లవరం మండలం

 

దళిత వాలంటీరు జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో నీ కుమారుడు శ్రీకాంత్ ను జైలుకు పంపించాడన్న కారణంతోనే అమలాపురం రూరల్‌ సీఐ ప్రశాంత్‌ కుమార్‌పై కక్ష కట్టావా అంటూ బీఎస్పీ నాయకులు బి కె వై సి నాయకులు అల్లవరం మండలానికి చెందిన పలువురు దళిత నాయకులు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌పై మండిపడ్డారు.మీరు అధికారంలోకి అధికారంలో వచ్చాక మీరు కక్ష పూరితంగా ఆయన్ను వీఆర్‌లోకి పంపి జైలుకు పంపిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురంలోని వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి విశ్వరూప్‌ అమలాపురం రూరల్‌ సీఐ ప్రశాంత్‌ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలపై అల్లవరంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అల్లవరంలోని గోసంగివారిపేటలో ఓ ఇంటిపై కొందరు అల్లరి మూకలు దాడిచేసి బైక్‌కు, ఇంటికి నిప్పు పెడితే దానిపై చట్టపరంగా చర్యలు తీసుకున్న పోలీసు అధికారికి రాజకీయ రంగు పులిమి ఇష్టాను సారంగా మాట్లాడితే ఎవ్వరూ నమ్మరన్నారు. దళితులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసిన మీరు లేని ప్రేమను నటిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నావన్నారు. గోసంగివారిపేటలో జరిగిన సంఘటనపై దర్యాప్తు చేసిన క్రమంలోనే కొంత మంది దొరికిపోయారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. మీ కుమారుడిపై హత్యా ఆరోపణల విషయంలోనూ రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశావని, అయితే అదెవరూ నమ్మలేదన్నారు. తామూ దళితులమేనని, కోనసీమ అల్లర్లలో మీ ఇంటిపై దాడికి పాల్పడిన సంఘటనలో ఇదే సీఐ ప్రశాంత్‌కుమార్‌ మీ దగ్గర పనిచేస్తే అప్పడు మంచివాడు.. ఇప్పుడు మంచివాడు కాదా అని ప్రశ్నించారు. తామూ దళితులమేనని, దళితులమైన మాకు న్యాయం చేసినందుకు పోలీసు అధికారిని జైలుకు పంపుతావా అంటూ మండిపడ్డారు. ఈ సమావేశంలో నూకపెయ్యి సత్యనారాయణ, జుత్తుక సత్యనారాయణ, వడ్డి వీరాస్వామి, రొక్కాల నాగేశ్వరరావు, శెట్టిబత్తుల తులసీరావు, నూకపెయ్యి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo