భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు పట్టణానికి చెందిన ప్రముఖ శిల్పి వాసా శ్రీనివాస్ బాలరాముని విగ్రహాన్ని బహూకరించారు. గన్నవరంలోని స్వర్ణభారత్ ట్రస్టులో బీజేపీ సీనియర్ నాయకుడు వల్లూరి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో మాజీ ఉప రాష్ట్రపతిని శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ పంచలోహాలతో తయారు చేసిన బాలరాముని విగ్రహాన్ని జ్ఞాపికగా అందించారు. శ్రీనివాస్ కళానైపుణ్యాన్ని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి, ఎంతో అందంగా తయారైన విగ్రహాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుక్కపల్లి నాగేశ్వరరావు, అయోధ్య తెలుగు వారి నిత్యాన్నదానం ట్రస్ట్ నిర్వాహకులు చల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.