ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పై జనసేన పార్టీ నాయకులు కించ పరుస్తూ అవహేళనగా మాట్లాడటం సబబు కాదని మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, దళిత నేత పలివెల సుధాకర్ అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న వికృత పాలన అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్న విధానాలను తప్పు పట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. సాధారణ స్థాయి నుంచి శాసనమండలి స్థాయి వరకు ఎదిగిన క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న శాసనమండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ పై కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు కించ పరుస్తూ అవహేళనగా మాట్లాడటం సబబు కాదని హెచ్చరించారు. భారతరాజ్యంగ చట్టం ప్రకారం ప్రశ్నించేహక్కు ఉందన్నారు.ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కవింపు చర్యలు, బెదిరింపులకు ఇజ్రాయిల్ బెదిరిపోయేవారు కాదన్నారు.ఈ సమావేశంలో వైసీపీ దళిత నేత కొనాల చంద్రబోస్ పాల్గొన్నారు.