పార్టీ బలోపేతానికి కృషి…
మండపేట విజయలక్ష్మి నగర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ తోట త్రిమూర్తులు ని నియోజకవర్గ వైసిపి పరిశీలకులు కటకంశెట్టి విజయ ధర్మ ఆదిత్య కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్, సర్పంచ్ సలాది సతీష్, మాజీ ఏ యం సి ఛైర్మన్ సిరిపురపు శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కటకంశెట్టి విజయ ధర్మ ఆదిత్య, నియోజకవర్గ పార్టీ పటిష్టత కోసం తన పూర్తి స్థాయి సహకారం అందిస్తానని పేర్కొన్నారు.పార్టీ బలోపేతానికి అవిశ్రాంతంగా కృషి చేస్తానని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు హామీ ఇచ్చారు.బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనే నినాదంతో పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు.ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, పార్టీ కార్యకర్తలు నాయకుల సమన్వయంతో మండపేట నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ జెండాను ఎగురవేయడమే తమ లక్ష్యమని అన్నారు.