Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవిపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

రంప ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి , విజయభాస్కర్ పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి

అభివృద్ధి , సంక్షేమం చూడలేక చేస్తున్న వ్యాఖ్యలు ఇవి..!

మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఇకనైనా తన తీరు మార్చుకోవాలి.

వ్యాఖ్యలను ఖండించిన ఎటపాక టిడిపి సీనియర్ నాయకులు పాటి చలపతిరావు , పాటి సంపత్ , బాచినేని శ్రీకాంత్

విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక

ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి , విజయభాస్కర్ పై వైకాపా మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని టిడిపి సీనియర్ నాయకులు పాటి చలపతిరావు , తెలుగు యువత నాయకులు పాటి సంపత్ , ఐ టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ బాచినేని శ్రీకాంత్ హితవు పలికారు. ఎటపాక మండల కేంద్రంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం హాయాంలో అవినీతి ఆరోపణలలో ముందున్న మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి , ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ , నేడు ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి భాస్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల పెంపు , మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.13 వేలు వంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మీ ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడుందని వారు ప్రశ్నించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు , సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తన వంతు సాయం అందించడం చేస్తున్న ఎమ్మెల్యే శిరీష దేవిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని అన్నారు. వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని , మరలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ పాలడుగు నవీన్ , బూత్ ఇంచార్జ్ దుద్దుకూరి రాము , రాసాల చంటి , తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo