వెలగతోడు, వల్లూరు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) చైర్మన్ లు గా నియమితులైన వల్లూరి వీరవెంకట సత్యనారాయణ (అబ్బు), గుత్తుల శ్రీనివాసు లు మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పిఎసిఎస్ చైర్మన్ లు, మెంబర్లు గా నియమితులైన వారందరినీ ఎమ్మెల్యే వేగుళ్ల దుశ్శాలువాతో సత్కరించారు. వెలగతోడు పిఎసిఎస్ మెంబర్లు గా సరాకుల అబ్బులు, బోనగిరి సూర్యారావు లు, వల్లూరు పిఎసిఎస్ మెంబర్లు గా చల్లా సూర్యనారాయణ, మాత వరప్రసాద్ బాబు లు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కూటమి నాయకులు పాల్గొన్నారు