మండపేట నియోజకవర్గం, రాయవరం మండలం, మాచవరం, పసలపూడి, మండపేట ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) చైర్మన్ లు గా నియమితులైన మేడపాటి రవీంద్రరెడ్డి, సత్తి వెంకట కృష్ణారెడ్డి, కుక్కల రామారావు లు బుధవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసారు. తనపై నమ్మకంతో పిఎసిఎస్ చైర్మన్ లు గా నియమించిన ఎమ్మెల్యే వేగుళ్ళ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పిఎసిఎస్ చైర్మన్ లు, మెంబర్లు గా నియమితులైన వారందరినీ ఎమ్మెల్యే వేగుళ్ల దుశ్శాలువాతో సత్కరించారు. మాచవరం పిఎసిఎస్ మెంబర్లు గా తిపర్తి శ్రీరమేష్, మోర్త దావీదు లు, పసలపూడి పిఎసిఎస్ మెంబర్లు గా అనసూరి శ్రీనివాసరావు, బుంగ పెద్ద లు, మండపేట పిఎసిఎస్ మెంబర్లు గా పైడిమళ్ల డేవిడ్ రాజు, పడాల జన్నయ్య లు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, రామచంద్రాపురం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి, సబ్బెళ్ళ వెంకన్నబాబు, రిమ్మలపూడి సత్యనారాయణ, కొవ్వూరి ఆదిరెడ్డి, కోడి చిన్న అప్పారావు, గండి చంద్రశేఖర్, రొంగల శ్రీనివాసరావు, నెల్లి రాము, కొవ్వూరి కృష్ణారెడ్డి, కర్రి కృష్ణారెడ్డి, మల్లిడి సూర్రెడ్డి, నల్లమిల్లి సతీష్ రెడ్డి, నల్లమిల్లి వెంకన్నబాబు, మల్లిడి అమ్మిరెడ్డి, నల్లమిల్లి అయ్యప్ప గౌతమ్ రెడ్డి, అనసూరి గోవిందరాజు, నామాల చంద్రరావు, పలివెల వెంకన్న, గుత్తుల సత్తిబాబు, కడియాల గోవిందు, తదితరులు పాల్గొన్నారు.

