మండపేట పట్టణంలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబ సభ్యులను శనివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పరామర్శించారు. ఇటీవల మరణించిన మండపేట పట్టణం 18వ వార్డులో కోరాడ వీరభద్రరావు, 23వ వార్డులో గోమాడ సత్యవతి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ పరామర్శలలో ఎమ్మెల్యే వెంట జొన్నపల్లి సూర్యరావు, బొడ్డు రామకృష్ణ, పాలచర్ల శిరీష్, రెడ్డి రామకృష్ణ, రెడ్డి సత్యనారాయణ, నరిగిరి బాపయ్య, తదితర్లు ఉన్నారు.