నేపాల్ ఆందోళనతో చైనాలో సురక్షితం…
రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మెన్ ఎమ్మెల్సీ మండపేట నియోజకవర్గ వైసిపి ఇన్ ఛార్జ్ తోట త్రిమూర్తులు మానస సరోవరం యాత్ర లో ఉన్నారు. ఆయన హైదరాబాద్ నుండి ఈ నెల 5 న నేపాల్ , చైనా భారత్ సరిహద్దు లోని మానస సరోవరం యాత్ర కి సుమారు 40 మంది బృందం తో తరలి వెళ్లారు. కైలాస ఈశ్వర దర్శనం కోసం ఆయన తన సతీమణి, కుమార్తె తో కలిసి అక్కడికి వెళ్లారు.కాగా ఆయన మానస సరోవరం నుండి చైనా వెళ్లిన అనంతరం నేపాల్ సరిహద్దు లోని ఆయన బస చేసిన హోటల్ లో అల్లర్లు జరిగాయి. ఈ నేపద్యంలో తోట అబిమానులు ఆందోళన చెందారు. తోట తనయుడు తోట పృధ్వీ రాజ్ ఎప్పటికప్పుడు తోట త్రిమూర్తులు తో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా పృధ్వీ మాట్లాడుతూ తోట త్రిమూర్తులు ప్రస్తుతం చైనా లో సురక్షితంగా క్షేమం గా ఉన్నారని పేర్కొన్నారు. అక్కడి నుండి సరోవరం దర్శనం అనంతరం భారతదేశానికి చేరుకుంటారని చెప్పారు. ఈ నెల 16 న మండపేట వస్తారని వెల్లడించారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు ఆయన యోగక్షేమాలు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నానని చెప్పారు.

