– ఎస్ కె వి టి డిగ్రీ కాలేజీలో 90మొక్కలు నాటీన వైనం.
– పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి.
– ప్రకృతి బాగుంటేనే మనిషితో సహా జీవరాశుల న్నీ బాగుంటాయి.
స్థానిక ఎస్ కె వి టి డిగ్రీ కాలేజీ ఆవరణలో మానవత సంస్థ ఆధ్వర్యాన మంగళవారం పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈసందర్బంగా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం అవసరమన్నారు. ఈవిషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. ప్రపంచంలో మానవుడు జీవించాలంటే ప్రకృతి సహకరించాలని, కానీ ఓజోన్ పొర దెబ్బతిని నేలతల్లి బాధపడుతోందని, తద్వారానే మనందరం ఎంతో ఇబ్బందికి గురవుతున్నామని అన్నారు. ప్లాస్టిక్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోందన్నారు. పర్యావరణం దెబ్బతినడం వలననే నిన్న మొన్నటి వరకు ఓ సూక్ష్మ క్రిమి వలన ప్రపంచం తల్లడిల్లిపోయిందని మోహన్ రావు అన్నారు. 2040నాటికి ప్రకృతి చాలా దారుణంగా ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెబుతున్నారని ఆయన అన్నారు. మనం ఎంతగొప్పగా ప్రకృతిని అనుభవించామో రేపు రాబోయే తరాలు కూడా అంతకంటే గొప్పగా ప్రకృతిని ఆస్వాదించాలంటే ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలన్నారు.
కళాశాల ప్రిన్సిపల్ బివి తిరుపయ్య మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా పచ్చదనానికి మారుపేరైన తమ కళాశాలలో 120మొక్కలు ఉన్నాయని మానవతా సంస్థ వాళ్ళు 20రకాల 90మొక్కలు ఈరోజు నాటారని తెలిపారు. బయట వాతావరణం కంటే ఈ కళాశాలలో 2,3 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉంటుందని, అందుకు కారణం ఇక్కడ మొక్కలు ఉండడమేనని అన్నారు. పర్యావరణం దెబ్బతింటే ఎంతో ప్రమాదమని ఆయన సోదాహరణంగా వివరించారు. ఇలా మొక్కలు నాటడం వలన సముద్ర నీటిమట్టాలు పెరగడం, భూతాపం పెరగడం తగ్గుతుందని అన్నారు. మొక్కలు నాటిన మానవతా సంస్థ వారికీ కృతజ్ఞతలు తెలిపారు.
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఎక్స్ మేనేజర్,రాజమహేంద్రవరం ప్రెసిడెంట్ బోరుగడ్డ మురళి మాట్లాడుతూ మనం ఈరోజు కృత్రిమ ఆక్సిజన్ తీసుకుంటున్నామని, సహజ సిద్ధమైన ఆక్సిజన్ మొక్కల వలన వస్తుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది సభ్యులు గల మానవతా సంస్థ ఈవేళ మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. మహాకుంభమేళా లో వచ్చిన వ్యర్ధాలను అక్కడి కలెక్టర్ తొలగించి, మొక్కలు నాటడం ద్వారా వాతావరణ సమతుల్యం సాధించారని అన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలకు కోట్లాదిమంది యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడ పర్యావరణాన్ని కాపాడుకోడానికి ఇప్పటినుంచే పెద్దఎత్తున మొక్కలు నాటాలని అన్నారు.
మానవత స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు కండెపు వెంకట సూర్య నారాయణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ దినం సందర్బంగా మానవతా సంస్థ ఉభయ గోదావరి జిల్లాల సభ్యులు ఇక్కడకు వచ్చి,రాజమండ్రి యూనిట్ తరపున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఒక కన్నీటి బొట్టు అయినా ఆపాలని ఉద్దేశ్యంతో మానవతా సంస్థ స్థాపించామన్నారు. అందులో భాగంగా ఒక మొక్క అయినా బతికిస్తే కనీసం వందమందికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో ఇక్కడ 80మొక్కలు నటీనటులు ఆయన తెలిపారు.ఈ మొక్కలన్నింటీని బతికించుకోవాలని ఆయన కోరారు.
జంగారెడ్డి గూడెంకు చెందిన మొక్కలదాత దల్లి రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ ఈరోజు ఎస్ కె వి టి కాలేజీకి 90మొక్కలు నాటడం కోసం మానవతా సంస్థ తరపున ఇచ్చినట్లు తెలిపారు. అంతరించిపోయే జంతు జాబితాలో కొంతకాలానికి మానవుడు కూడా చేరే ప్రమాదం ఉందని, అందుకే పర్యావరణాన్ని కాపాడుకోవాలని అన్నారు. వాతావరణం కలుషితంగా మారి,సునామీలు, భూకంపాలు,వంటివి వస్తున్నాయని,మరోపక్క మనుషుల్లో పునరుత్పత్తి శక్తి కూడా తగ్గిపోతోందని ఆయన అన్నారు. మొక్కను పెంచితేనే భూమి మామూలు స్టేజికి రాదని, అందుకే ప్రతిఒక్కరూ మొక్కలు నాటి, పెంచాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో లెక్చరర్ కవి డాక్టర్ పి.వి.బి సంజీవరావు,కవియిత్రి కండేపు సునీత,జిల్లా కన్వీనర్ కే గంగాధర్, రాజమహేంద్రవరం శాఖ చైర్మన్,సి.పి.రెడ్డి, రాజమహేంద్రవరం కన్వీనర్ కె గాంధీ మాస్టర్,
రాజమహేంద్రవరం కార్యదర్శి కె.విశ్వనాథ్,
పర్యావరణ సంరక్షణ కమిటీ చైర్మన్ ధర్మరెడ్డి,
వైస్ చైర్మన్ ఏ శ్రీనివాసరావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కె చంద్రయ్య మాస్టర్ తదితర పెద్దలు, మహిళలు, విద్యార్ధులు పాల్గొన్నారు.