మండపేట మండలం మారేడుబాక గ్రామంలో శనివారం సాయంత్రం సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో శ్రీ లలితాదేవి ఇండస్ట్రీస్ పేరుతో నిర్వహిస్తున్న పిల్లోస్ తయారీ సంస్థ పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్టు స్థానికులు తెలిపారు. మండపేట ఇంచార్జ్ ఫైర్ అధికారి ఎం వెంకటరావు ఆధ్వర్యంలో మండపేట, రామచంద్రపురం ఫైర్ సిబ్బంది రెండు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు రూ.40 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు తెలిపారు. ఇటీవలే బ్యాంకు లోన్ ముగియడంతో ఇన్సూరెన్స్ కూడా లేదని తమ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.