మాజీ మంత్రి, వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం నివాసంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురాం ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఒమ్మి రఘురాం మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకునిగా పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియమించబడినట్లు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.