జమాతె ఇస్లాం ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ద్వారా గత నెల రోజులుగా చేపట్టిన మట్టిలో చేతులు – హృదయంలో దేశం ఉద్యమం ఈ ఆదివారంతో ముగిసింది.ఈ ఉద్యమంలో భాగంగా పిల్లల్లో పర్యావరణ పై ఆవగాహన కొరకు వ్యాసరచన పోటిలతో పాటుగా డ్రాయింగ్ కార్యక్రమాలు మరియు విభిన్న ప్రాంతాలలో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని స్దానిక జమాతె మహిళా అధ్యక్షురాలు అయేషా తెలిపారు .ఈ సందర్భంగా సెంట్రల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ బాధ్యురాలు మొహతాబ్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు కనుక పిల్లల్లో ప్రత్యేకంగా పర్యావరణ పై ఆవగాహన కల్పించి చెట్ల పరిరక్షణ జరిగే విధంగా వారిని ప్రోత్సాహించాలని జమాతె దేశ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని నేటితో ఈ కార్యక్రమం ముగుస్తుందని కనుక పిల్లల ద్వారా పర్యావరణ పరిరక్షణ ర్యాలీ చేయడం జరిగిందని ఆమె తెలియజేశారు.రానున్న రోజుల్లో జమాతె ఆధ్వర్యంలో పిల్లల్లో నైతిక పరివర్తనకు కృషి చేయడం జరుగుతుందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో హుమైరా,షమ్మి,సబిహ జమాతె సభ్యులు రిజ్వాన్,జైనులాబీదీన్ తదితరులు పాల్గొన్నారు….