ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి దళితులకి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా విద్య ఆరోగ్యం సంబంధించి అంశాలు రావడంలేదని దానికి ప్రత్యయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్ జవహర్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ని కోరారు. గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కె ఎస్ జోహార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ కమిషనర్ కు సంబంధించిన పలు అంశాలపై చంద్రబాబు నాయుడుతో చర్చించి, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువత కు ఉపాధి కల్పించాలని, చర్మ కారు వృత్తి మీద ఆధారపడిన వాళ్లకి సెంట్రల్ ఫుట్వేర్ ఇండస్ట్రీస్ నుండి ట్రైనింగ్ తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి చేసి వారిని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ తరగతులు ఇప్పించవలసిందిగా కోరడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు ఏదైనా ప్రధానంగా అట్రాసిటీ గాని అదే విధంగా ల్యాండ్ విషయంలో గాని ఉన్నటువంటి సమస్యలను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుని అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు.

