ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 2,30,000 విలువ గల చెక్కులని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు లబ్ది దారులకి అందజేశారు. శుక్రవారం కొవ్వూరు లోని టిడిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల వైద్య ఖర్చులకు ప్రభుత్వం తమ వంతు ఆసరాగా నిలవాలనే ద్యేయంతో ఈ సహాయ నిధి ప్రారంభించాం అన్నారు. ఈ కార్యక్రమంలో ద్వి సభ్య కమిటీ సభ్యులు కంఠమని రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు సూర్యదేవర రంజిత్ కుమార్, బేతిన నారాయణ, కొప్పాక జవహర్ , పసలపూడి హరి బాబు, నీలిమ, పెనుమాక జయరాజు, బీజేపీ నాయకులు ముత్యాలరావు, పిల్లలమఱ్ఱి మురళి తదితర ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు

