ఇటీవల ప్రైవేట్ హాస్పటల్స్ నందు వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కొరకు ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 36 మందికి 20,13,759/- రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు కాగా సదరు చెక్కులను బుధవారం మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు చేతులమీదిగా బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, ఆయా గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు తదితర్లు పాల్గొన్నారు