మండపేట మున్సిపల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎంతోమంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది విశ్రాంతి ఉద్యోగీ జంగా విశ్వాస్ కుమార్ సోమవారం సాయంత్రం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ప్రజాసేవ పరమావధిగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో వైస్సార్ పార్టీ లో క్రియ శీలకంగా ఉంటున్నా జంగా విశ్వస్ కుమార్ సోమవారం సాయంత్రం రాజమహేంద్రవరం లో ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన భార్య జంగా ఏఎస్ శాంత కుమారి ప్రస్తుత మున్సిపల్ కో అప్షన్ సభ్యురాలుగా ఉన్నారు. ఈయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిన్నటి వరకు తమతో కలిసి ఉన్నా విశ్వస్ కుమార్ మృతి పట్ల ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, సీనియర్ నాయకులు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు, వైయస్సార్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్, నియోజకవర్గం ఐటీ వింగ్ కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు, 8 వార్డ్ కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, వైసిపి మున్సిపల్ శాఖ అధ్యక్షురాలు నీలం దుర్గ, 28 వార్డు కౌన్సిలర్ మొండి భవాని మురళి, గుణిపే శ్యాంసుందర్రావు, విప్పర్తి సింహాచలం, కనికెళ్ల పల్లవి దుర్గాప్రసాద్, పోలమాల సత్తిబాబు, సన్మాలా ధనరాజ్, కొమరపు సత్యనారాయణ, కోళ్ల శ్రీను లు సంతాపం తెలిపారు

