Sunday, August 3, 2025
🔔 9
Latest Notifications
Sunday, August 3, 2025
🔔 9
Latest Notifications

ముస్లింల అభ్యున్నతికే  జె ఏ సి…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

కన్వీనర్ ఇబ్రహీం షరీఫ్…

విశ్వం వాయిస్ న్యూస్, మండపేట

మండపేట ముస్లిం ల అభివృద్ధి కి జె ఏ సి కృషి చేస్తుందని మండపేట ముస్లిం జె ఏ సి కన్వీనర్ సయ్యద్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు.మండపేట విజయలక్ష్మి నగర్ అక్సా మశీదులో  పరిచయ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జె ఏ సి కన్వీనర్  సయ్యద్ ఇబ్రాహీం షరీఫ్  మాట్లాడుతూ  జె ఏ సి ప్రారంభదశలో ఉందన్నారు. రాబోయే రోజుల్లో ముస్లింల అభివృద్ది కి కృషి చేస్తామని పేర్కొన్నారు.పట్టణంలోని ముస్లింలందరు  జె ఏ సి కి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.జె ఏ సి జమాత్ (సంఘాలు)  రాజకీయలకు అతీతంగా పని చేస్తుందని స్పష్టం చేశారు.మండపేట హానఫీ  అహలే సున్నత్ వల్ జమాత్ జమియా మస్జిద్ అధ్యక్షులు అతావుర్ రెహమాన్ మాట్లాడుతూ పట్టణంలో‌ ముస్లింలందరు ఏకతాటి పై ఉంటూ జె ఏ సి అభివృద్దికి సహకరించాలని‌ కోరారు.వైసిపి మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ రబ్బానీ మాట్లాడుతూ జె ఏ సి ద్వారా ముస్లిం సమాజానికి మంచి చేయడానికి తమంతా కలసి ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.జిల్లా నూర్ బాషా సంఘం అధ్యక్షులు షేక్ ఇబ్రాహీం మాట్లాడుతూ అందరు కలసి  భాగస్వాములు కావడం చాలా సంతోషదయకమైన విషయం అన్నారు. చిన బాదుల్లా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమం కోసం ఎన్నో ఎళ్ళ నుండి ఎదురు చూస్తున్నాని   పేర్కొన్నారు. రెహమాన్ తబ్రెఅలం కలసి  లోగో ను అవిష్కరించారు. వక్ప్ చట్టం ఎవరికి చుట్టం‌  పుస్తకాన్ని షేక్ మౌలానా అవిష్కరించారు.ఈ కార్యక్రమంలో హానఫీ అహలే సున్నత్ వల్ జమాత్ జామియా మస్జిద్ కమిటీ కార్యదర్శి ఎండి  కరీం (ఖాదరి),ఫారుఖ్ అలీ,అమీనా మస్జిద్ ప్రెసిడెంట్ ఎండి రహీం, హంజా మస్జిద్ కమిటీ అధ్యక్షులు అర్షి,షేక్ మౌలాలీ, వైసిపి మైనార్టీ సెల్ టౌన్  అద్యక్షులు షేక్ గౌస్ మొహిద్దిన్ ,మెకానిక్ కరీం, షేక్ బిలాల్, షేక్ అర్షద్  తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo