ఎమ్మెల్యే వేగుళ్ళకు ముస్లింలు విజ్ఞప్తి…
మండపేట పట్టణంలో దాదాపు 10 వేలు మంది ముస్లిం లు నివసిస్తున్నారు. గత వందేళ్ల క్రితం కలువపువ్వు సెంటర్ లో వున్న జామియా మస్జీద్ లో మాత్రమే స్మశాన వాటిక ఉంది. ఇపుడు పట్టణం లో నాలుగు మజీదు లు ఉన్నాయి. ఎవరైనా ముస్లిం చనిపోతే ఖననం చేయడానికి స్తలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇపుడున్న ముస్లిం జనాభా కు తగ్గట్లు సుమారు మూడు ఎకరాల భూమి అవసరం ఉంది. ఈ సమస్య పై గత 30 ఏళ్లు గా ముస్లింలు పోరాడుతూనే ఉన్నారు. అయినా ఇప్పటికీ ఏ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం చూపలేదు. గతంలో కాంగ్రెస్ హయం లో మంత్రి షబ్బీర్ ఆలీ రెవెన్యూ అధికారులు కు ఆదేశాలు ఇచ్చిన పలితం లేదు. ఈ సమస్య ను పరిష్కరించాలని ముస్లిం లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్య ను పరిష్కరించాలని శుక్రవారం మండపేట ముస్లిం జె ఎ సి ఆద్వర్యంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా జె ఎ సి కన్వీనర్ సయ్యద్ ఇబ్రాహీం, మండపేట జామియా మస్జిద్ అధ్యక్ష కార్యదర్శులు ఎండి అతవూర్ రెహమాన్ అల్తాఫ్ కార్యదర్శి కరీం ఖాదారీ లు మాట్లాడుతూ సమస్య పరిష్కారం కు వేగుళ్ళ జోగేశ్వరరావు సానుకూలంగా స్పందించారని చెప్పారు.ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు షేక్ ఇబ్రహీం, ముస్లిం జె ఎ సి సభ్యులు వైఎస్సార్ మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షులు షేక్ గౌస్, అక్సా మస్జిద్ నిర్వాహకులు షేక్ చినబాదుల్లా, రాష్ట్ర టిడిపి మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ మౌలాలీ, టిడిపి మైనార్టీ సెల్ టౌన్ అద్యక్షులు మెకానిక్ కరీం, అమీనా మస్జిద్ ప్రెసిడెంట్ ఎండి రహీం, హంజా మస్జిద్ కమిటీ ప్రెసిడెంట్ ఎండి అర్షి, అమీనా మస్జిద్ బాధ్యులు ఫారుఖ్, సయ్యద్ సల్మాన్, షేక్ హుస్సేన్, టిడిపి నాయకులు ఎండి గయసుద్దీన్,ముస్లిం జె ఏ సి సభ్యులు,ముస్లింలు పాల్గొన్నారు.

