Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications
Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications

ముస్లింల అభివృద్ధి, సంక్షేమం టిడిపి తోనే సాధ్యం…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ముస్లింలపై కపట ప్రేమ చూపిస్తున్నా అసదుద్దీన్ ఓవైసీ…

చంద్రబాబు నాయుడుపై అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు అర్దరహితం…

తెలుగుదేశం రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్…

మండపేట

రాష్ట్రం లో ముస్లింల సంక్షేమం  అభివృద్ధి టిడిపి ప్రభుత్వంతో సాధ్యo అవుతుందని  తెలుగుదేశం రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ పేర్కొన్నారు. మండపేట తెలుగుదేశం కార్యాలయం లో శుక్రవారం సల్మాన్ హుస్సేన్   మాట్లాడుతూ ఎంఐఎంఅధినేత అసదుద్దీన్ ఓవైసీ కర్నూల్ లో జరిగిన ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభను వైసీపీ – ఓవైసీ ల  రాజకీయ సభగా మార్చేశారనీ మండిపడ్డారు. అసదుద్దీన్ ఓవైసీ కి నిజంగా ముస్లింలపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే జగన్ హయాంలో ముస్లింలకు అన్యాయం  జరిగినప్పుడు ఏమైపోయారనీ ప్రశ్నించారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి  ఐదేళ్ల పాలనలో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అప్పుడు మాట్లాడని ఓవైసీ  చంద్రబాబు నాయుడు  పై, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. కర్నూలు సభలో వక్ఫ్ కు సంబంధించిన అంశాల మీద మాట్లాడకుండా రాజకీయ అంశాలు ఎందుకు మాట్లాడారనీ ప్రశ్నించారు. ముస్లిం సమాజం ఓవైసీ మాటలను నమ్మే పరిస్థితిలో లేరని తేల్చి చెప్పారు. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో  ముస్లిం లు గెలుపొందే  స్థానాల్లో  ఎన్నికలు జరిగినప్పుడు ముస్లిం ఓటు బ్యాంకు ను చీల్చింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు . ఎంఐఎం పార్టీ అధినేతగా ఒక ఎంపీగా ముస్లిం సమాజానికి ఏమి చేశారో చెప్పాలని నిలదీశారు. టిడిపి ప్రభుత్వంలో  రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముస్లింల సంక్షేమం అభివృద్ధి కి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చంద్రబాబు నాయుడు  పై విమర్శలను  ఖండించారు.ఇకనైనా కూటమి ప్రభుత్వం పైన విమర్శలు మానేసి తెలంగాణలో ముస్లిం ల సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని సల్మాన్ హుస్సేన్ హితావు పలికారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo