రావులపాలెం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.1.42 కోట్ల నిధులతో నిర్మించిన సీసీ రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…..
రావులపాలెం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం…..
రూ.1.42 కోట్ల నిధులతో నిర్మించిన సీసీ రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ హయంలో పల్లెల్లో కనీస అవసరాలైన రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కూడా జరగలేదన్నారు. శుక్రవారం రావులపాలెం మండలంలోని రావులపాలెం, రావులపాడు, లక్ష్మీ పోలవరం గ్రామాల్లో ఆయన నూతనంగా నిర్మించిన పలు సీసీ రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదనపు తరగతి గదులు తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
<span;><span;> రావులపాలెం పంచాయతీ ఏరియాలో విక్టరీ రెస్టారెంట్ వరకు గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.10లక్షలతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైన్, సీసీ రహదారిని ప్రారంభించారు.
<span;><span;>* రావులపాలెంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో బాగంగా రూ.40 లక్షల నిధులతో ఆర్ అండ్ బి రోడ్డు నుంచి కొవ్వూరి వేణుగోపాలరెడ్డి ఇంటి వరకు, రాఘవేంద్ర ఆసుపత్రి రహదారి తో పాటు, శ్రీరామ్ ఫిజియోథెరపీ ఆసుపత్రి రోడ్డు, ఆర్ అండ్ బి రోడ్డు నుంచి ఉల్లిపాయల షాపు వీధి వరకు నిర్మించిన పలు సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు.
<span;><span;>* రావులపాలెం పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి విజయ సప్లై కంపెనీ వరకు గ్రామపంచాయతీ 15 ఆర్థిక సంఘం నిధులు రూ.12.70 లక్షలతో నిర్మించిన సిసి రహదారి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ప్రారంభించారు.
<span;><span;>* గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.9 లక్షలతో నిమ్మకాయల వారి వీధి నుంచి రవి కిరణ్ ఆసుపత్రి ప్రక్క వీధి వరకు నిర్మించిన సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ప్రారంభించారు.
<span;><span;>* గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.11.70 లక్షలతో జక్కంపూడి వారి వీధి నందు నిర్మించిన సిసి రహదారి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఆయన ప్రారంభించారు.
<span;><span;>* రావులపాడు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.18.49 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు.
<span;><span;>* రావులపాడులో రూ. 3 లక్షలతో రెనోవేషన్ చేసిన ప్రధాన కాలువపై కాలిబాట వంతెనను ఆయన ప్రారంభించారు.
<span;><span;>* లక్ష్మీ పోలవరం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ.37 లక్షలతో బండారు సత్యానందరావు కాలనీ, చిర్ల జగ్గిరెడ్డి కాలనీ నందు నిర్మించిన సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా రావులపాలెంలో ఆయన మాట్లాడుతూ రావులపాలెం మేజర్ పంచాయతీ అభివృద్ధికి అందర్నీ కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉండటంతో పాటు విద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశ్రమలతో వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు.మరీ ముఖ్యంగా గ్రామపంచాయతీ, పెద్దల సహకారంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం, కళా వెంకట్రావు సెంటర్ సుందరీకరణ పనులు చేపడతామన్నారు. ప్రధాన డ్రైను, వెదిరేశ్వరం వైపుకు వెళ్లాల్సిన మెయిన్ డ్రైను అవుట్ లెట్ పనుల అంచనాలు సైతం రూపొందించడం జరుగుతుందన్నారు. గ్రామ పెద్దలు, అధికారులు, కూటమి నాయకుల తోడ్పాటుతో రావులపాలెం అభివృద్ధిపై దృష్టి సారించడం జరుగుతుందన్నారు. రావులపాడు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, కె వి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల రాంబాబు,పాలూరి సత్యానందం,కొప్పిశెట్టి ప్రసాద్,అంబటి కిషోర్, కొవ్వూరి అచ్చిరెడ్డి మరియు సర్పంచ్ లు, ఎంపీటీసీలు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

