సాధారణ వర్షాలకే జలమయం అయినా రోడ్లు
చిన్నపాటి వర్షాలకే రోడ్లు జలమయం అవుతున్న పరిస్థితి కొవ్వూరు మండలం నందమూరు – పసివేదల వెళ్లే రోడ్లు చూస్తే అర్ధమవుతుంది. నిన్న రాత్రి కురిసిన వర్షాలకు అడుగు లోతు నీరు రావడంతో ద్విచక్ర వాహనదారులు నానాతంటాలు పడుతున్నారు. వర్షం పడితే ఇది చిన్న పాటి కాలువగా మారుతుందని ప్రజల వాపోతున్నారు. అధికారులతో ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోడం లేదని , మాకు సరైన రోడ్లు వేయండి అని ప్రజలు ప్రాధేయపడుతున్నారు.

