వైయస్సార్ పార్టీ మాజీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు నందిగామ సురేష్ ను మండపేట వైయస్సార్ పార్టీ నియోజకవర్గ ఆర్ టి ఐ యాక్ట్ విభాగ అధ్యక్షులు 8 వ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ అమరావతి లో ఉన్న ఉద్దండ రాయుడుపాలెం లో ఆయన ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.టిడిపి ప్రభుత్వ అక్రమ అరెస్టులతో సంవత్సరం పాటు జైల్లో వేధింపులకు గురి అయ్యారని రవి కుమార్ అన్నారు. బెయిల్ పై విడుదలైన నందిగామ సురేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి పరార్శించినట్లు చెప్పారు. పార్టీ అండదండలు ఎప్పుడు ఉంటాయని అన్నారు. సూపర్ సిక్స్ అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెడతారని అధికారం ఇస్తే ఈ ప్రతికార కక్ష సాధింపు చర్యలు ఏంటని ప్రశ్నించారు, టిడిపి అక్రమా అరెస్టులను ఖండించారు ఇది దుర్మార్గ చర్యని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 18 వ వార్డు ఇంచార్జ్ ఎర్రగుంట అయ్యప్ప, దుగ్గిరాల చిన్న తదితరులు పాల్గొన్నారు.

