ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ లో నిరుపేదలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ అన్నారు.మందపల్లి నరేంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా శనివారం ఏడో వార్డు లోని ఆదర్శ హెల్పింగ్ హాండ్స్ సంస్థ లో నిరుపేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందపల్లి సంజీవరావు, మండపేట మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, మందపల్లి సుధాకర్ రావు, మడికి ఆనందరావు పాల్గొన్నారు