నవోదయం 2.0 లో నాటు సారాయి రహిత గ్రామo
ఫలిస్తున్న పోలీసుల చర్యలు
ఎక్సైజ్ సి ఐ కె రామ్మోహన్ రావు వెల్లడి
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలంలోని సామర్లకోట ఒక పెద్ద గ్రామంలో ఉన్నటువంటి మూడు గ్రామాలను నాటు సారాయి రహిత గ్రామంగా ఎక్సైజ్ సి ఐ కె రామ్మోహన్రావు ప్రకటించారు. వివరాల ప్రకారం సోమవారం సిఐ కె రామ్మోహన్రావు ఆధ్వర్యంలో సామర్లకోట మండలంలోని ఉండూరు సచివాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు. సిఐ మాట్లాడుతూ గతంలో సామర్లకోట మండలం ఉండూరు గ్రామ పరిధి ప్రాంతాలలో నాటు సారాయి విక్రయం అధికంగా ఉండేదని, ఇటీవల ప్రభుత్వం నవోదయం 2.0 పథకం ప్రవేశపెట్టి విస్తృతంగా ప్రచారం మొదలుపెట్టి ఆయా గ్రామాల్లోని ప్రజలు సారాయి జోలికి పోకుండా జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుందని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సహకారం సమన్వయంతో కాకినాడ రూరల్ మండలం, సర్పవరం, తిమ్మాపురం గ్రామాల్లో కూడా గతంలో నాటు సారాయి విక్రయాలు ఎక్కువగా ఉండేవని, నవోదయం 2.0 ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ కూడా ఈ విధంగా గ్రామసభలు నిర్వహించి ప్రజలకు నాటు సారాయి వల్ల కలిగే అనారోగ్యతలు గురించి వివరించి, జీవనోపాధి చేసుకునే విధంగా ప్రోత్సహించే నాటు సారాయి రహిత గ్రామాలుగా మార్చిదిద్దామని అన్నారు. ఎక్కడైనా గ్రామాల్లో నాటు సారాయి తయారీ మరియు విక్రయాలు జరిగితే వెంటనే ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ కే రామ్మోహన్రావు, ఎస్సైలు ఎం వి వి బి కుమార్, బి ఎన్ ఎస్ వరహాలు, ఎక్సైజ్ సిబ్బంది, సామర్లకోట మండలం లోని ఉండూరు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.