14 October 2025
Tuesday, October 14, 2025

నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించిన నారా లోకేష్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

అమలాపురం

నేపాల్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని స్వస్థలాలకు రప్పించడానికి ఎంతగానో కృషిచేసిన రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పనితీరు అభినందనీయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రశంసించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు వారికి అపద వచ్చిన ప్రతి సందర్భంలో వారిని రక్షించడానికి మంత్రి నారా లోకేష్ ముందుంటారని మరోమారు ఈ సంఘటనతో రుజువైందన్నారు. నేపాల్ లో జరుగుతున్న మారణోమంలో తెలుగు వారు ఉన్నారని తెలియగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా మంత్రి లోకేష్ స్పందించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మంత్రి తన అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని మరీ సచివాలయంలోనే ఉండి రియల్టైం గవర్నెన్స్ సెంటర్ వార్ రూమ్ ను కమాండ్ కంట్రోల్ రూమ్ గా మార్చి సహాయక చర్యలను వేగవంతం చేశారని తెలిపారు.బాధితులతో ఆయన నేరుగా మాట్లాడి వారికి ధైర్యం చెప్పారని, ఎక్కడెక్కడ ఉన్నారో లొకేషన్ కోఆర్డినేట్లతో సహా మ్యాప్ సిద్ధం చేయించారని, ఢిల్లీలోని ఏపీ భవన్ లో అత్యవసర హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పొరుగుదేశంలో చిక్కుకుపోయిన ప్రజలకు ఆహారం, నీరు, వసతి సదుపాయాలు కల్పించేలా లోకేష్ చర్యలు తీసుకున్నారన్నారు. తన మానవీయ స్పందనతో రాష్ట్ర ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను లోకేష్ చాటి చెప్పారని కొనియాడారు. కేంద్రం అండతో, సమన్వయంతో నేపాల్లో జరుగుతున్న అల్లర్లలో చిక్కుకున్న సుమారు 215 తెలుగు ప్రజలను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో లోకేష్ ప్రధాన పాత్ర పోషించడం అభినందనీయమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ఎప్పుడు, ఎక్కడ ఆపద వచ్చినా ఆదుకోవడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందన్న విషయం నేపాల్ సంఘటనలో నారా లోకేష్ వ్యవహరించిన తీరు ద్వారా మరోసారి స్పష్టమైందన్నారు. గతంలో కంబోడియా సైబర్ స్కామ్ లో భాగంగా కంబోడియాలో మోసపూరిత ఉద్యోగ ఆఫర్లతో చిక్కుకున్న మీసాల ఆదిబాబు వంటి తెలుగు యువకులను రక్షించడంలో లోకేష్ కృషి చేశారన్నారు. నేపాల్లో తెలుగువారు చిక్కుకుంటే వైసిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి నుంచి కనీస స్పందన లేదని విమర్శించారు. కనీస మానవతాదృక్పథంతో కూడా జగన్ స్పందించలేదన్నారు. గతంలో ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని తీసుకురావడంలో, గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకురావడంలో చంద్రబాబునాయుడు కీలకపాత్ర పోషించారని, ఇప్పుడు నేపాల్ నుంచి తెలుగువారికి సురక్షితంగా తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు.తెలుగు వారికి అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వమేనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo