.ఈనెల 14 వ తేదీ సోమ వారం స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) ద్వారా అర్జీ దారుల వినతులను స్వీకరించడం జరుగు తుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదివా రం ఒక ప్రకటనలో తెలి పారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం (పీజీ ఆర్ఎస్) ద్వారా అర్జీల స్వీకరణ ప్రక్రియ చేపట్ట నున్నట్టు తెలిపారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి భవన్ నందు మూడు రెవెన్యూ డివిజన్ ప్రధాన కేంద్రాలలోను 4 మునిసిపల్ ప్రధాన కార్యాలయాలలోనూ 22మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తార న్నారు. ప్రజలు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసు కోవాలని జిల్లాకలె క్టర్ తెలిపారు. అదేవి ధంగా అర్జీదారులు తమ అర్జీలను పిజిఆర్ఎస్ వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, నమోదైన అర్జీల పరిష్కార స్థితిగతు లు సంబంధిత సమాచా రం తెలుసుకు నేందుకు 1100 కి నేరుగా ఫోన్ చేసి సంప్రదించవ చ్చునని తెలిపారు. కావున అర్జీదా రులు జిల్లా, డివిజన్, మండల నిర్దేశిత స్థాయిల లోనీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలను ఆశ్రయించి తమ తమ సమస్యలకు తగు పరి ష్కార మార్గాలు పొందాలని ఆయన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు