2025 మెగా డీ ఎస్ ఈ లో జగ్గంపేట మండలం జె. కొత్తూరు గ్రామానికి చెందిన నిడమర్తి రాజ్ కుమార్ తండ్రి ఇశ్రాయేలు అనే యువకునికి ఎస్ జి టి గా అవకాశం దక్కడంతో పలువురు అభినందించారు.జె. కొత్తూరు గ్రామానికి చెందిన దళిత సామాన్య కుటుంబానికి చెందిన ఈ యువకుడు ఎంతో కష్టపడి తన విజయంతో ఇటు కుటుంబానికి, అటు జె.కొత్తూరు గ్రామానికి ఎనలేని గౌరవాన్ని తెచ్చాడన్నారు.గ్రామంలో ఎస్సీ సామజిక వర్గం నుండి మొట్ట మొదటిగా ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన ఘనత సాధించాడన్నారు. ఈ సందర్భంగా నిడమర్తి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వానికి, జ్యోతుల ఫౌండేషన్ వార్కి, ఇందుకు సహకరించిన అందరికీ ముఖ్యంగా జె. కొత్తూరు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.