ఇటీవలే ప్రకటించిన ఉత్తమ శానిటేషన్ మున్సిపాలిటీలో మండపేట మొదటి స్థానం కైవసం చేసుకుంది. ఈ రికార్డు దక్కించుకోవడానికి మున్సిపల్ కమిషనర్, ఆర్ పి లు, శానిటేషన్ సెక్రటరీలు మరియు వర్కర్లు అందరూ కలిసి సమిష్టిగా కృషితో సాధించినప్పటికీ దోమల నిర్మూలన విషయంలో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలే బాహాటంగా చర్చించుకుంటున్నారు. పుర విధుల్లో గల డ్రైనేజిలలో నీరు పారకుండా అడ్డంగా గుబురుగా మొలిచిన పిచ్చి మొక్కలే కాకుండా డ్రైనేజిలోంచి తీసిన చెత్తను తీసుకువెళ్లడంలోను అలసత్వం కనపడుతుందని అట్టహాసంగా చెప్పుకుంటున్నారు. ఒక పక్కన ఈ దోమల వల్ల విష జ్వరాలు, డెంగ్యూ విజృంభిస్తున్నాయి అయినా సరే నిమ్మకి నీరెత్తినట్టు మున్సిపల్ సిబ్బంది వైఖరి ర్యాంకుల కోసం కాకుండా ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడాలని, డెంగ్యూ, వీష జ్వరాలపట్ల తీసుకోవలసిన తగు జాగ్రత్తలను ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.

