బాలబాలికల్లో నులి పురుగుల సమస్య నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి ఏటా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తుందని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం కొవ్వూరు పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ నందు అంతర్జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం సందర్భంగా గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రెండు విడతల్లో నూలి పురుగుల నివారణ మాత్రలు విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అన్నారు. ఆల్బెండజోల్ మాత్రలు విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి, మున్సిపల్ మాజి చైర్మన్ సూరపనేని చిన్ని, ద్వి సభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ, కొవ్వూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాయన రామకృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు పెనుమక జయరాజు మరియు టిడిపి నాయకులు వైద్యయ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులుుు తదితరులు పాల్గొన్నారు

