Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

ఎన్నికల హామీ నెరవేర్చిన ఘనత చంద్రబాబుదే…!

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం – అభివృద్ధి పరుగులు

పిచుకలపాడులో సుపరిపాలనలో తొలిఅడుగు ఇంటింటి కార్యక్రమం

టిడిపి నాయకులు పాటి సంపత్ , బాచినేని శ్రీకాంత్ ఆధ్వర్యంలో

కుసుమనపల్లిలో క్లస్టర్ ఇంచార్జ్ వల్లభనేని చందు ఆధ్వర్యంలో

త్రిపుర పెంటవీడులో యూనిట్ ఇన్చార్జి బాచినేని మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో

విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక

ఎన్నికల హామీ నెరవేర్చిన ఘనత చంద్రబాబుదే అంటూ , కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం – అభివృద్ధి రాష్ట్రంలో పరుగులు పెడుతుందని టిడిపి నాయకులు పాటి సంపత్ , ఐ టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ బాచినేని శ్రీకాంత్ పేర్కొన్నారు. మండలంలోని పిచుకలపాడు గ్రామంలో ఆదివారం సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిరువురు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందజేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఇటీవల తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతూ ఉంటే అంతమందికి రూ.15 వేలు నగదు తల్లుల ఖాతాలో జమ చేశారని తెలిపారు. ఏడాది పాలనలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో మేలు జరిగిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరును, పురోగతిని ప్రజలకు వివరించారు. అంతేకాకుండా కుసుమనపల్లి గ్రామంలో టిడిపి ఎటపాక క్లస్టర్ ఇంచార్జ్ వల్లభనేని చందు ఆధ్వర్యంలో , త్రిపుర పెంటవీడు గ్రామంలో యూనిట్ ఇంచార్జ్ బాచినేని మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తెలుగు తమ్ముళ్లు పాలడుగు నవీన్ , తేజావత్ లక్ష్మణ్ , దుద్దుకూరు నగేష్ , సతీష్ , ఎస్టీ సెల్ నాయకులు పూసం రాఘవయ్య , అపకా రాంబాబు , రాకేష్ కొట్టే , ప్రశాంత్ , గద్దల వెంకన్న , తదితరులు పాల్గొన్నారు

 

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo