Sunday, August 3, 2025
Sunday, August 3, 2025

ఎన్నికల విధుల పట్ల అలసత్వం వద్దు …

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జిల్లా ఓటర్ నమోదు అధికారి  పి.కృష్ణమూర్తి…

విశ్వం వాయిస్ న్యూస్, మండపేట

బూత్ లెవల్ అధికారుల జాతీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా  మండపేట అసెంబ్లీ నియోజకవర్గం (48) ఓటర్ నమోదు అధికారి మరియు స్పెషల్ డిప్యూటీ కలక్టర్ పి.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో  గురువారం నాడు మండపేట ఎంపీడీవో కార్యాలయంలో మండపేట మండలం,రాయవరం మండలం,కపిలేశ్వరపురం మండలలకు సంబంధించిన 42 మంది బూత్ లెవెల్ అధికారులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది.ఓటర్ నమోదు అధికారి మరియు స్పెషల్ డిప్యూటీ కలక్టర్ పి.కృష్ణమూర్తి  మాట్లాడుతూ బూత్ లెవల్ అధికారులు ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం వ్యవహరించరాదని శిక్షణ తరగతులను సద్వినియోగించుకోవాలని అన్నారు. ఈ శిక్షణ తరగతులు అనంతరం ఎన్నికల కమీషన్ ఏర్పాటు చేసిన గూగుల్ లింక్  ద్వారా పరీక్షలు నిర్వహించి ధ్రువపత్రాలు పంపిణీ చేశారు తదుపరి ప్రతిజ్ఞ చేయించారు. ఈ బూత్ లెవెల్ శిక్షణ కార్యక్రమాలు11.07.2025 వ తేదీ నుండి 5 బ్యాచ్ లతో  17.07.2025 వ తేదీతో ముగిసినవి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పి.తేజేశ్వరరావు, డిప్యూటీ తహసిల్దార్ పీ ఏ మెహర్ బాబా,టిడిపి మాజీ అద్యక్షులు ఉంగరాల రాంబాబు, టిడిపి నాయకులు మేడపాటి రవీంద్రారెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు పాలిక రమణ, పందిరి వీర్రాజు ,మాస్టర్ ట్రైనర్  నాగం నాగ శివ,  సీనియర్ అసిస్టెంట్ మేకా శ్రీనివాస్ రావు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆంజనేయులు, మూడు మండలల బి ఎల్ ఓ లు,తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo