ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి అండగా నిలుస్తున్న లోకేష్ కృషి ప్రశంసనీయం
ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు .ఈ సందర్బంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తెలుగు వారికి అపద అనే పదం వినబడితే చాలు నన్ను దాటి వారిని టచ్ చేయాలనే విధంగా మానవతా దృక్పథంతో ఆపదకే అడ్డుగా నిలిచారు. నారా లోకేష్ అని అన్నారు.నేపాల్ లో జరుగుతున్న మారణోమంలో తెలుగు వారు ఉన్నారని తెలియగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించారు.అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని, ఉదయాన్నే హుటాహుటిన సచివాలయానికి చేరుకున్నారు. రియల్టైం గవర్నెన్స్ సెంటర్ వార్ రూమ్ ను కమాండ్ కంట్రోల్ రూమ్ మార్చి సహాయక చర్యలను వేగవంతంచేశారు.బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఎక్కడెక్కడ ఉన్నారో లొకేషన్ కోఆర్డినేట్లతో సహా మ్యాప్ సిద్ధం చేయించారు.కేంద్రం అండతోసమన్వంతో ఈ ఆపదలో ఉన్న ఒక్కొక్కరినీ సురక్షితంగా రక్షించడానికి లోకేష్ పక్కా వ్యూహంతో ముందుకు కదిలారు.నేపాల్లో జరుగుతున్న అల్లర్లలో చిక్కుకున్న సుమారు 215 తెలుగు ప్రజలను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.మన జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు, నాకు మిత్రులు సానా సతీష్ ప్రత్యేక విమానం ఏర్పాటుచేసి 215 మందిని ఇండియా తీసుకురావటంలో సహకరించిన సతీష్ ను అభినందించారు.నేపాల్లో తెలుగువారు చిక్కుకుంటే జగన్ రెడ్డి నుంచి కనీస స్పందన లేదు. మానవతాదృక్పథంతో కూడా వ్యవహరించలేదు కానీ నిబద్ధతతో రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తున్న ముఖ్యమంత్రిని ఎందులో కన్నా దూకి చనిపో అని ప్రేరేపించిన జగన్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన న్యాయస్థానానికి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, పైడిపాల సూరిబాబు, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, పాలచర్ల నాగేంద్ర చౌదరి, వేములకొండ జోగారావు, దాపర్తి సీతారామయ్య, బద్ది సురేష్, తుమ్మల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.