డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జిల్లా మామిడికుదురు — జగ్గనపేట సెంటర్లో ఎంతో ఉత్సాహభరితంగా, ఆంధ్రుల ఆరాధ్య దైవం, జనసేన పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన “హరిహర వీరమల్లు” చిత్రం విడుదల సందర్భంగా ఘనమైన విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ రాజోలు శాసనసభ్యులు దేవ ప్రసాద్ స్వయంగా ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి పిఠాపురం ఎమ్మెల్యే వారి పాటకు స్టెప్పులు వేస్తూ అందరికీ ఉత్సాహాన్ని పంచారు. అనంతరం చిత్ర విజయాన్ని ఆకాంక్షిస్తూ భారీ కేక్ కట్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు, ప్రజాప్రతినిధులు, పవన్ కళ్యాణ్ గ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహాన్ని చాటిచెప్పారు. హరిహర వీరమల్లు సినిమాను విజయవంతం చేయడంలో ఇది ఒక చారిత్రక సమర్పణగా నిలిచింది