నూతన జాతీయ విద్యా విధానంతో పేదవారికి విద్య దూరం: ఎమ్మెల్సీ బొర్రా గోపీ మూర్తి
నూతన జాతీయ విద్యా విధానంతో పేదవారికి విద్య దూరం…..
ఎమ్మెల్సీ బొర్రా గోపీ మూర్తి…
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కాకినాడ జిల్లా ప్లీనరీ సమావేశాలు స్థానిక కచ్చేరి పేట యూటీఎఫ్ హోమ్లో రెండో రోజు జిల్లా అధ్యక్షుడు జి శ్రీకాంత్ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్ఎల్సి బొర్రా గోపీమూర్తి మాట్లాడుతూ దేశంలో నూతన జాతీయ విద్యా విధానం వచ్చిన తర్వాత విద్య పేదవారికి అందరిదాక్షగా తయారైందని విమర్శించారు. దేశంలో ఎక్కడా నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయకపోయినా మన రాష్ట్రంలో నూతన జాతి విద్యా విధానంలో అమలు చేస్తూ ప్రభుత్వ బడులను మూసివేస్తున్నారని విమర్శించారు. విద్య రంగంలో నూతన జాతీయ విధానం, మూడు సీలు విధానం అమలవుతుందన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడం కోసం దేశంలో ఎస్ఎఫ్ఐ ఒకటే సమరశీల పోరాటం నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వ విద్యా రంగం కోసం ఎస్ఎఫ్ఐ కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదరికం తగ్గిస్తామని చెప్పి పి ఫోర్ విధానాన్ని ప్రవేశపెట్టి మొత్తం వ్యవస్థలను ప్రైవేటు పరం చేయడం కోసం చూస్తుందని అందులో భాగంగానే విద్యను కూడా ప్రైవేట్ పరం చేయడం కోసం ఆలోచన చేస్తుందని ఎమ్మెల్సీ గోపీ మూర్తి విమర్శించారు.ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీలో పలువురు చేరిక ,భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు కాకినాడలో రెండు రోజులపాటు నిర్వహించారు. ఈ సమావేశాలు రెండో రోజు యుటిఎఫ్ హోమ్లో జరిగిన సమావేశంలో నూతన జిల్లా కమిటీలోకి జిల్లా సహాయ కార్యదర్శిలుగా లోవరాజు (పిఠాపురం), అమృత (కాకినాడ), మణికంఠ (ప్రత్తిపాడు)జిల్లా కమిటీ సభ్యులుగా ఉదయ్ కుమార్(తుని), రవి(సామర్లకోట) అవకాశం లభించింది. జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు జి శ్రీకాంత్, ఎమ్ గంగాసూరిబాబు తెలియజేశారు.