వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది – ఎమ్మెల్యే ముప్పిడి
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో అత్యవసర వైద్య సేవల బలోపేతం కోసం కొత్త ఏ ఎల్ ఎస్ అంబులెన్స్ ను కొవ్వూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు.
కొవ్వూరు నియోజకవర్గంలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా కీలకమైన చర్యలో భాగంగా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ (ALS) అంబులెన్స్‌ను కేటాయించడం జరిగిందన్నారు. ఈ అంబులెన్స్‌లో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన అన్ని ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏ ఎల్ ఎస్ అంబులెన్స్‌ను ముప్పిడి వెంకటేశ్వర రావు స్వయంగా పరిశీలించి, దానిలోని వైద్య పరికరాలు, సాంకేతిక సౌకర్యాల గురించి వివరంగా తెలుసుకున్నారు. అనంతరం, ఆయన జెండా ఊపి అంబులెన్స్‌ను జిల్లా ప్రజల సేవ కోసం అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ భావన రత్నకుమారి, టు మాన్ కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సూరపనేని చిన్ని, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు మద్దిపట్ల శివరామకృష్ణ, టిడిపి పట్టణ అధ్యక్షులు దాయన రామకృష్ణ, వేమగిరి వెంకట్రావు, కాంత రాజు, టిడిపి సీనియర్ నాయకులు సూర్యదేవర రంజిత్ కుమార్, కాకర్ల సత్యేంద్ర, ఎంపీపీ కాకర్ల నారాయుడు, ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు, హెల్త్ డిపార్ట్మెంట్ తదితరులు పాల్గొన్నారు.