14 October 2025
Tuesday, October 14, 2025

నులిపురుగుల వలన పిల్లలలో శారీరక, మానసిక ఎదుగుదల మందగిస్తుంది

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

సోమేశ్వరం గ్రామంలో నేషనల్ డివార్మింగ్ డే ప్రోగ్రాం

 

స్థానిక కూటమి నాయకులు సహకారం

 

అన్ని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ

విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, మంగళవారం రాయవరం మండలం, సోమేశ్వరం గ్రామంలో స్థానిక కూటమి నాయకులు, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు శాకా నాగేంద్ర, ఎల్లే కిషోర్ సహకారంతో, అన్ని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు (ఆల్బెండజోల్ 400ఎమ్.జి) ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది ఎమ్.ఎ.ఎన్.ఎమ్ రామలక్ష్మి, ఎం.ఎన్.ఎమ్ రమాదేవి ఆధ్వర్యంలో మింగింపచేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలలో నులిపురుగుల తో శారీరక, మానసిక ఎదుగుదల మందగిస్తుందని, తల్లిదండ్రులు పిల్లల శుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు, గోర్లు పెరగకుండా కత్తిరిస్తూ, భోజనానికి ముందు, మల,మూత్ర విసర్జన అనంతరం చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, తినే ఆహార పదార్థాలపై మూతలు వేసి ఉంచాలని, రోడ్ల ప్రక్కన దొరికే అపరిశుభ్రమైన తినుబండారాలు తినకూడదని విద్యార్థులకు సూచించారు, ఈ నులి పురుగులు వలన రక్తహీనత, మతిమరుపు లాంటి లక్షణాలు ఉంటాయని, అల్బెండజోల్‌ మాత్రలు వేయడం వల్ల వాటిని నివారించవచ్చన్నారు.1-3 సంవత్సరాల లోపు పిల్లలు 200mg, 3-19 సంవత్సరాల లోపు వారికి 400mg వేసుకోవడం ద్వారా పిల్లలలో రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్ శాతం పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్.ఎల్.హెచ్.పి సుగుణ, హెచ్.ఎ గణేష్ , ఆశా కార్యకర్తలు వరలక్ష్మి, భాగ్యలక్ష్మి, కనకదుర్గ, బుజ్జి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo