Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications
Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications

నెట్వర్క్ పనిచేయని స్మార్ట్ ఫోన్లు మాకొద్దు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

నెట్వర్క్ పనిచేయని స్మార్ట్ ఫోన్లు మాకొద్దు

సిడిపిఓ కార్యాలయంలో తిరిగి ఇచ్చేసిన అంగన్వాడి ఫోన్లు

ముఖచిత్రం యాప్ రద్దు చేయాలి

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్

ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కాకినాడ రూరల్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న తొమ్మిది సెక్టార్ల అంగన్వాడిలు నెట్వర్క్ లేని స్మార్ట్ ఫోన్లు సిడిపిఓ కార్యాలయం లో తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు పి. వీరవేణి, ఎ. వీరమణి మాట్లాడుతూ నెట్వర్క్ పనిచేయని ఫోన్ లతో 11 యాపుల భారంతో పనిచేయలేక ఫోన్లు తిరిగి సిడిపిఓ కార్యాలయంలో అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చిన స్మార్ట్ ఫోన్ లో నెట్వర్క్, నెట్ ఇతర సౌకర్యాలు లేక రిపోర్టులు సక్రమంగా అందించక అధికారులు వేధింపులు ఎక్కువవుతున్నాయి అన్నారు. అంగన్వాడి సెంటర్లో రికార్డులో రాసి లబ్ధిదారులకు పోస్టుకాహారం అందజేస్తామన్నారు. సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి టి. రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యాప్ లు భారం తగ్గిస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని విమర్శించారు. చంద్రబాబు పాలన విజన్ ఉంటుంది కానీ అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే ఫోన్లో నెట్వర్క్ ఉండటం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ లీడర్లు సత్యవేణి, రాజేశ్వరి, లక్ష్మి, తనుజ, వరలక్ష్మి, భవాని, అచ్చిరత్నం, నాగజ్యోతి, సురేఖ, చామంతి తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
తెలంగాణ
తూర్పు గోదావరి
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
వనిత వాయిస్
కృష్ణా
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo