సరికొత్త ప్రతిపాదనతో వైస్ జగన్ ను కలిసిన యారమాటి…
తోట సారధ్యంలో ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్తాం…
యారామటి వెంకన్నబాబు…
మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఐటి వింగ్ అధ్యక్షులుగా ఎంపికైన యారమాటి వెంకన్నబాబును మండపేట నియోజకవర్గం పార్టి ఇంచార్జ్, పిఏసీ కమిటి మెంబర్, రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుతో కలసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు వైయస్.జగన్మోహన్ రెడ్డిని గౌరవప్రదంగా కలిసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకన్నబాబు వైయస్.జగన్ తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొలువైనప్పటి నుండి మండపేట నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి, సంక్షేమం కనుచూపుమేర కనపడటం లేదు కాబట్టి ప్రజలకు మరియు కార్యకర్తలకు భరోసాగా నిలబడటం కోసం ఐటి వింగ్ తరుపున ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుతో కలిసి “నాయకుడితోనే న్యాయంచేయిస్తాం” అనే కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నామని వెంకన్నబాబు తెలిపారు. దీనితో పాటు పార్టీ ఆదేశానుసారం అన్యాయానికి గురైన పార్టీ కార్యకర్తలు, ప్రజలకు డిజిటల్ బుక్ ద్వారా మండపేట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డెస్క్ ను కూడా ఎప్పుడు అందుబాటులో ఉంచామని తెలిపారు. రాబోయేది వైసీపీ పాలనేనని పార్టీ అధ్యక్షులు జగన్ అన్నారు. శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు నాయకత్వంలో నియోజకవర్గ పార్టీ ప్రతిష్టతకు మరింత కృషి చేసి వచ్చే స్థానిక సంస్థలు పురపాలక సంఘ ఎన్నికలలో గతంలో మాదిరిగానే పార్టీని బారి మెజారిటీతో గెలిపించాలని జగన్ సూచించారని తెలిపారు.

