ఒక్కొక్కరికి 25 కేజీల రైస్ బ్యాగులను ఉచితంగా పంపిణీ
జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందరికీ ఉమ్మడిగా ఇన్సూరెన్స్ అందిస్తానన్న జ్యోతుల నవీన్
అర్హులైన ప్రతి ఆటో కార్మికుడికి మూడు సెంట్లు భూమిని అందిస్తాం
జగ్గంపేట నియోజకవర్గం లోని ప్రతి ఆటో కార్మిక సోదరుడికి అండగా నిలుస్తానని జగ్గంపేట శాసనసభ్యులు టిటిడి బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ అన్నారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఆటో కార్మికులందరికీ ఉమ్మడి ఇన్సూరెన్స్ చేయిస్తానన్న కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ .గోకవరం మండలంలో ఆటో కార్మికులకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం బస్తాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికులు రోజువారీ ఆదాయంలో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా సరే సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయన్నారు.వారి కష్టాలను దృష్టిలో ఉంచుకొని, మానవతా దృక్పథంతో తన ఫౌండేషన్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. గోకవరం మండలంలో సుమారు 500 మందికి, ఇతర మండలాలతో కలిపి మొత్తం 1700 మందికి పైగా కార్మికులకు బియ్యం పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలుకేవలం బియ్యం పంపిణీకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో ఆటో కార్మికులందరికీ ఫౌండేషన్ తరఫున గ్రూప్ ఇన్సూరెన్స్ చేయిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, అర్హులైన సుమారు 2000 మంది నిరుపేద ఆటో కార్మికులకు మూడు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతామని ఆయన ప్రకటించారు. సూపర్ సిక్స్ పై వైసిపి నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవడంతో ఏమి చేయాలో అర్థం కాక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైసిపి నాయకులు చెబుతున్నట్టు మోసం ఎక్కడున్నదని మెగా డీఎస్సీలో గాని, తల్లికి వందనంలో గాని, ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీలో గాని, అన్నదాత సుఖీభవ పథకంలో గాని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో గాని మోసం ఎక్కడ ఉందో బహిరంగ తెలపాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సవాల్ విసిరారు. ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ కడప భరత్ కుమార్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, సూరంపాలెం ప్రాజెక్ట్ చైర్మన్ ఉంగరాల రాము, గోకవరం మండల పిల్లా చంటిబాబు, జగ్గంపేట మండల కన్వీనర్ జీను మణిబాబు, గోకవరం సొసైటీ చైర్మన్ గాజింగం సత్తిబాబు, క్లస్టర్ ఇంచార్జ్ కన్నబాబు ,మండల ప్రధాన కార్యదర్శి గునిపే భరత్ మరియు రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి టిడిపి నాయకులు, ఆటో యూనియన్ ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.