శెట్టి బలిజ సామాజిక వర్గ నేతలతో కలిసి బాధితులకు పరామర్శ
నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు
మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి..
మద్యం మత్తులో ఆటో డ్రైవర్, ప్రయాణికులపై దాడి చేసిన ఘటనలో బాధితులైన వాసంశెట్టి రామకృష్ణ, అనుసూరి అన్నపూర్ణ తదితరులను మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ మంగళవారం వి.సావరం గ్రామంలో వారి గృహం వద్ద పరామర్శించి,వారిని ధైర్య పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం తెల్లవారుజామున జరిగిన సంఘటన నిందితుల నేర స్వభావానికి నిదర్శనమని ఇట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ఈ సమస్య కేవలం ఒక సామాజిక వర్గానికి చెందినది కాదని, నిందితుల వెనుక ఉన్నది ఎంతటి పెద్ద వారైనా ఉపేక్షించేది లేదని, అందరినీ కలుపుకుంటూ న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని బాధితులకు హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ శెట్టిబలిజ సంఘ అధ్యక్షులు కొప్పిశెట్టి శ్రీనివాస్ (డ్రైవర్ శీను), రాయుడు సురేష్, మండపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేష్, మారేడుబాక సర్పంచ్ రాయుడు గంగరాజు, మండపేట 13వ వార్డు ఇంచార్జ్ పలివెల వెంకన్న, సొసైటీ డైరెక్టర్ గుత్తుల శ్రీనివాస్, సోమేశ్వరం దేవస్థాన కమిటీ చైర్మన్ గుత్తుల పవన్ కుమార్, వెదురుపాక సొసైటీ చైర్మన్ పిల్లి గణేష్ ,మాజీ సర్పంచ్ వాసంశెట్టి గాంధీ, మండల తెదేపా సోషల్ మీడియా కన్వీనర్ కేతా సతీష్ కుమార్ (నాని), శెట్టిబలిజ సంఘ సభ్యులు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.