పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు మరోసారి పెద్దసైజ్ గుడ్‌న్యూస్ వచ్చింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’ సినిమా షూటింగ్ పూర్తయిందని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ మాస్ లుక్‌తో ఉన్న కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేయడం అభిమానుల్లో ఫుల్ జోష్ తీసుకొచ్చింది.
ముంబై నేపథ్యంతో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పవన్ కల్యాణ్ ఇంటెన్స్, శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్లు ప్రేక్షకుల్లో పెద్దస్థాయి అంచనాలను రేపాయి. ముఖ్యంగా తాజాగా రిలీజ్ అయిన పోస్టర్‌లో పవన్ కల్యాణ్ స్టైల్, మాస్ లుక్ అభిమానులను మరింత ఆకట్టుకుంటుంది.
సినిమా టీమ్ చెప్పినట్లుగా, “అన్ని షూటింగ్‌లు పూర్తయ్యాయి.. ఇప్పుడు థియేటర్ల వంతు. ఓజీ ఆశ్చర్యపరచబోతోంది” అంటూ ఇచ్చిన అప్‌డేట్ సినిమా హైప్‌ను రెట్టింపు చేసింది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్ లాంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తమన్ అందిస్తున్న సంగీతం, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 2025 సెప్టెంబర్ 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ తన సినిమాలపై కచ్చితంగా ఫోకస్ పెట్టి షూటింగ్‌లను వేగంగా పూర్తి చేస్తుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ మూవీకి ఎదురుచూస్తున్నారు. ఈసారి బాక్సాఫీస్ వద్ద ఓజీ మాస్ సెన్సేషన్ అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్.