ఘటన జరిగిన 48 గంటలలోపే కేసును చేధించిన పోలీసులు
చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అభినందనలు
ప్రయాణికులతో వస్తున్న ఆటోను అడ్డగించి ఆటోడ్రైవర్ , ప్రయాణికులపై దాడి చేసిన ఘటనలో నిందితులైన శాఖా వినయ్ వంశీ, మాచవరపు వెంకట సాయి గణేష్, రిమ్మలపూడి శ్రీ సాయి కృష్ణ, పర్వతిని మౌళి సాయి క్రిష్ణ లను మంగళ వారం అదుపులోకి తీసుకుని, రిమాండ్ కు తరలించినట్లు మండపేట రూరల్ సీఐ దొర రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు అక్టోబర్ 06 సోమవారం ఉదయం 3.30 గంటలకు వెదురుపాక సావరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వాసంశెట్టి రామకృష్ణ, తన బందువులైన అనసూరి శ్రీనివాస్ కుటుంబం, హైదరాబాద్ నుండి స్వగ్రామమైన వి.సావరం గ్రామానికి తీసుకురావడానికి వెళ్ళగా, మాచవరం వంతెన వద్ద అప్పటికే బస్సు దిగి, ఆటో కోసం వేచి చూస్తున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులను నిందితులైన శాఖ వంశీ, అతని ముగ్గురు స్నేహితులు హేళన చేస్తూ, ఇబ్బంది పెడుతుండగా, రామకృష్ణ అక్కడికి చేరుకుని తమ బంధువులను ఆటో ఎక్కించుకుని, మాచవరం నుండి వెదురుపాక సావరం ఆటోలో వెళ్ళు చుండగా, సోమేశ్వరం గ్రామంలోని శివాలయం వద్దకు వచ్చేసరికి నిందితుడైన శాఖ వంశీ తన కారుతో ఆటోను వెంబడించి, ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్లి, అడ్డగించి ఆటో ను ఆపి, ఆటోలో ఉన్న ప్రయాణికులును చంపేస్తామని బెదిరించి, ఆటో డ్రైవర్ అయిన రామకృష్ణ ను కొట్టి, బలవంతంగా అతని వద్దనుండి సెల్ ఫోన్ లాక్కొనగా, కొడుతున్న వారిని ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలు ఎందుకు కొడుతున్నారు అని అడగగా, మహిళల పై సైతం దాడిచేసి గాయ పరిచారని, దీనిపై అనపర్తి ఏరియా హాస్పిటల్ నుండి వచ్చిన ఇంటిమేషన్, రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయవరం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పిర్యాదు పై మండపేట రూరల్ సిఐ పి.దొర రాజు అధ్వర్యంలో ఇన్చార్జి ఎస్సై జి.హరీష్ కుమార్ దర్యాప్తు చేసి, మంగళవారం మద్యాహ్నం 3.00 గంటలకు ఖచ్చితమైన సమాచారం తో మాచవరం పాత పెట్రోల్ బంకు వద్ద నిందితులైన శాఖ వినయ్ వంశీ, మాచవరపు వెంకట సాయి గణేష్, రిమ్మలపూడి శ్రీ సాయి కృష్ణ, పర్వతిని మౌళి సాయి క్రిష్ణ లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి నేరానికి వినియోగించిన మహేంద్రా ఎక్స్.యు.వి 700 కారును, మోటరోలా కంపెనీ ఫోన్ ను, స్వాధీనం పరుచుకుని నిందితులను కోర్టు తరలించినట్లు మండపేట రూరల్ సీఐ తెలిపారు. త్వరితగతిన కేసును చేదించి, ఘటన జరిగిన 48 గంటలలోపే నిందితులను అదుపులోకి తీసుకున్న సిఐ దొర రాజు, ఎస్సై జి.హరీష్ లను, సిబ్బందిని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రత్యేకంగా అబినందించారు