మండపేట మండలం కేశవరం గ్రామానికి చెందిన 26 మంది వైసీపీ కార్యకర్తలు మండపేట మండల టీడీపీ అధ్యక్షులు కర్రి తాతరావు ఆధ్వర్యంలో మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సమక్షంలో వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే వేగుళ్ళ టిడిపి కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీ లో చేరినట్లు వారంతా తెలిపారు. పార్టీలో చేరిన వారిలో చంద్రమళ్ళ యసయ్య, పోసుపో బుల్లిరాజు, చంద్రమళ్ళ ప్రకాష్, చంద్రమళ్ళ బాబి, మందపల్లి చంటి, బోనెల సుధాకర్, ఉండ్రాజపు క్రాంతి, చంద్రమళ్ళ రాజేష్, చంద్రమళ్ళ పవన్, చంద్రమళ్ళ బాపిరాజు, పలివెల అనిల్, చంద్రమళ్ళ జయకర్, శెట్టి చింటు, చంద్రమళ్ళ హర్ష, కొత్తపల్లి పండు, కోట జశ్వంత్, పెనుమచ్చి నాని, పోసుపో కమలాకర్, ఉండ్రాజపు సుబ్రహ్మణ్యం, కండేలి సతీష్, చంద్రమళ్ళ వంశీ, కమ్మరి చిన్న పోసియ్య, కె.సత్తమ్మ, వి.పాప, బి.పాప, వి.శ్రీదేవి లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, గుడ్ల ఈశ్వరరావు, ఉండమట్ల పనసరామన్న, ఉండమట్ల శివయ్య, కంటిపూడి సుభాష్, కొత్తపల్లి చరణ్, దొండపాటి దయానంద్, చంద్రమళ్ళ రాకేష్, వాదా ప్రసాదరావు, తదితర్లు పాల్గొన్నారు.

