2003 ఓటర్ల జాబితా ప్రాతిపదికన కొత్త ఓటర్ల జాబితా తయారు… రాజేశ్వరరావు
రాజకీయ పార్టీ ప్రతినిధులతో తహసిల్దార్ సమీక్ష సమావేశం…
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2003 ఆధారంగా కొత్త ఓటర్ లిస్టు తయారు చేయడం జరుగుతుందని మండపేట తహసిల్దార్ మరియు నియోజకవర్గ (48) సహాయ ఓటర్ నమోదు అధికారి పి. తేజేశ్వరరావు అన్నారు. గుర్తింపు పొందిన అన్ని జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో మండపేట తాహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తేజేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన క్లెయిమ్స్ స్టేటస్, రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ప్రపోజల్స్, బూత్ లెవెల్ ఏజెంట్లు నియామకం మరియు 2003 ఓటర్ జాబితా ఇంటెన్సివ్ రివిజన్ ప్రాతిపదికన తీసుకుని కొత్త ఓటర్ జాబితా తయారు చేయడం జరుగుతుందని నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి 2003 జాబితాను అనుసరించి ఎనగ్జరీ – సి ద్వారా నోటీసులు ఇవ్వడం జరుగుతుందని తిరిగి వాటిని బిఎల్ఓ ల ద్వారా పరిశీలించి కొత్త ఓటర్ లిస్టులో చేర్చడం జరుగుతుందని దాని ద్వారా పరిపూర్ణ ఓటర్ లిస్ట్ తయారవ్వడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు తయారుచేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పోలింగ్ బూత్ లో 1500 నుంచి 1200 ఓట్లకు తగ్గించడం జరిగిందని వాటి ఆధారంగా నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న 223 బూత్ లకు గాను 239 బూత్ లుగా పెరిగాయన్నారు. పెరిగిన 16 బూత్ లలో మండపేట రూరల్ 6, మున్సిపాలిటీ 6, రాయవరం 1, కపిలేశ్వరపురం 3 గా గుర్తించడం జరిగిందన్నారు. రాజకీయ పార్టీల నుంచి సలహాలు సూచనలులో భాగంగా వైయస్ఆర్సిపి నియోజకవర్గం ఐ టి వింగ్ అధ్యక్షులు యరమాటి వెంకన్నబాబు మాట్లాడుతూ మండపేట పట్టణంలో పెద్ద కాలువ నుంచి రాజారత్న థియేటర్ రోడ్డు ఏరియా వరకు ఒక పోలింగ్ కేంద్రం కూడా లేకపోవడం వల్ల ఆ ప్రాంతానికి చెందిన ఓటర్లు ఓటు వేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారుల దృష్టికి వెంకన్నబాబు తీసుకురావడం జరిగింది. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు ఎం.టి.రాజు, నాళం పి. ప్రకాష్, మునిసిపల్ టి.పి.ఓ. కడియాల శ్రీ రమ్య, ఎన్నికల ఆపరేటర్ ఎం.నిఖిత నీలిమ, రాయవరం రీ సర్వే డి.టి. కుమారి, ఐ. సంధ్య, మండపేట ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ పి.ఎ.మెహర్ బాబా, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

