శిక్షణలో పాల్గొన్న పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఏ.ఎన్.ఎం లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు
ఎ గ్రేడ్ సాధించడమే లక్ష్యంగా పంచాయతీలను అభివృద్ధి చేయాలి
ఎంపీడీవో కీర్తి స్పందన సూచన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో, ఎంపీడీవో కీర్తి స్పందన ఆద్వర్యంలో,మండల పరిషత్ అధ్యక్షులు నౌడు వెంకటరమణ అధ్యక్షతన “పంచాయతీ పురోగతి సూచిక” 2.O కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఏ.ఎన్.ఎం లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాల పై చర్చించారు, పంచాయతీల పనితీరుపై గ్రేడ్లు నిర్వహించ బడతాయని ఎ గ్రేడ్ సంపాదించిన పంచాయతీలకు రావాల్సిన నిధులు సకాలంలో రావడంతో పాటు,సక్రమంగా అభివృద్ధి పనులు నిర్వహించడానికి అవకాశం ఉంటుందని శిక్షణలో భాగంగా ఎంపీడీవో కీర్తి స్పందన తెలిపారు, ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వై సూర్యనారాయణ, పి రామలక్ష్మణమూర్తి, ఏపీఎం నాగేశ్వరరావు, ఎన్.ఆర్.జి.ఎస్ ఏపీవో సుధారాణి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఇ చైతన్య కుమారి, ఐసిడిఎస్ సూపర్వైజర్ లు విష్ణు,ఈశ్వరి,డిపిఎం సుధాకర్ శిక్షణ పొందుతున్న ఉద్యోగులు పాల్గొన్నారు.

