రాయవరం మండలం, పసలపూడి గ్రామంలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబ సభ్యులను గురువారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు పరామర్శించారు. ఇటీవల మరణించిన మట్టపర్తి బూరయ్య, పెంకె నారాయణమ్మ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ పరామర్శలలో ఎమ్మెల్యే వెంట కర్రి వెంకట కృష్ణారెడ్డి, నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి, నల్లమిల్లి సతీష్ రెడ్డి, సత్తి వెంకట కృష్ణారెడ్డి, అనసూరి శ్రీను, నల్లమిల్లి వెంకన్నబాబు, పడాల సత్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.