ఎటపాక మండలంలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్
తనిఖీలు నిర్వహించిన సీఐ ఎం కన్నపరాజు , ఎస్సై అప్పలరాజు
స్కూల్స్ పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులు, గంజాయి అమ్మితే కఠిన చర్యలు
ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ లో భాగంగా ఎటపాక పోలీసులు గురువారం నెల్లిపాక , నల్లకుంట హై స్కూల్ , ప్రైమరీ స్కూల్ పరిసర ప్రాంతాల్లో 100 అడుగుల దూరంలో ఉన్న పాన్ షాపులలో , కిరాణా దుకాణాలలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు ఎటపాక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.కన్నపరాజు నేతృత్వంలో ఎస్సై జి.అప్పలరాజు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది విద్యా సంస్థలకు దగ్గరలో సిగరెట్లు , ఇతర పొగాకు ఉత్పత్తులు అమ్మేవారికి హెచ్చరికలు జారీ చేశారు. 18 సంవత్సరాలలోపు వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. డ్రగ్స్, గంజాయి, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తనిఖీలు చేపట్టినట్లు సీఐ ఎం.కన్నపరాజు తెలిపారు. ప్రజలలో పోలీసులు ఉన్నారని ధైర్యం పెంచడానికి , చట్టవ్యతిరేక కార్యక్రమాలు పాల్పడేవారికి భయం పెంచే విధంగా పోలీసులు కార్యక్రమాలు ఉంటాయన్నారు. తనిఖీలను నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. చుట్టు పక్కల ప్రాంతాలలో ఎక్కడైన గంజాయి, ఇతర మత్తుపదార్థాలు విక్రయిస్తున్నట్లయితే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ తనిఖీలలో కానిస్టేబుల్ నాగరాజు , తదితరులు పాల్గొన్నారు.