ప్రతి జిల్లాకు అధికారులతో తనిఖీ బృందాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
హోల్ సేల్ డీలర్లు జిల్లా దాటి ఎరువులను సప్లై చేయరాదు
కృత్రిమ కొరతలు సృష్టించి రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలం పసలపూడి గ్రామంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం, అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం నుండి తనిఖీలు నిమిత్తం నియమించబడిన, అధికారుల బృందం ఎరువులు,పురుగుమందుల దుకాణాల పై దాడులు నిర్వహించారు, పసలపూడి గ్రామంలోని శ్రీ విజయ ఎంటర్ ప్రైజెస్ హోల్ సేల్ ఎరువుల షాపు నందు తనిఖీ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎ.డి.ఎ ఎల్.వి మధు, విజిలెన్స్ సిఐ డి.వి సతీష్ కుమార్ తనిఖీలు నిర్వహిస్తూ,రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువులు, పురుగుమందులు,అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని,దానికోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లా కు తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తుందని తెలిపారు, దుకాణం లోని స్టాక్ రిజిస్టర్ లు, బిల్లు పుస్తకాలు,పరిశీలించి ఎరువులు ప్రభుత్వ అనుమతి పొందిన కంపెనీల నుంచి వచ్చినవేనా ? లేక నకిలీవా.? అనే కోణంలో గొడౌన్ లో ఉన్న ఎరువుల బస్తాలు, పురుగు మందులను తనిఖీ చేసారు, హోల్ సేల్ డీలర్ల ద్వారా జిల్లా దాటి ఎరువులను సప్లై చేయరాదని ఆదేశాలు జారీ చేస్తూ, జిల్లా లోని ప్రతి గ్రామంలోనూ, రైతులకు నాణ్యమైన ఎరువులు అందించాలని, ముఖ్యంగా ఎరువులను దాచిపెట్టి, స్టాక్ లేదనే కారణం చూపి,కృత్రిమ ఎరువుల కొరతలు సృష్టించి, తనిఖీలలో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ప్రతి గ్రామంలోనూ తనిఖీలు నిర్వహించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు సబ్ డివిజన్ ఇన్చార్జ్ ADA, రాయవరం మండల వ్యవసాయ అధికారి కెవిఎన్ రమేష్ గారు, విస్తరణ అధికారి శివ శంకర్ పాల్గొన్నారు.